ప్రజాశక్తి -సామర్లకోట రూరల్ (కాకినాడ) : పంచారామ క్షేత్రమైన సామర్లకోట పంచారామ క్షేత్రమైన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో దసరా ఉత్సవాలు సోమవారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా ఆలయ దక్షిణ వైపున గల జమ్మి చెట్టు వద్ద శమీ పూజను ఆలయ కార్య నిర్వహణ అధికారి డి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పూజలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఆడబాల కుమారస్వామి తదితరులు విచ్చేసి పాల్గొన్నారు. జమ్మి చెట్టు వద్ద శమీ పూజలను ఆలయ పండితులు శాస్త్రవేత్తంగా నిర్వహించగా ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పూజతో దసరా ఉత్సవాలు ముగింపు జరగగా పూజల్లో పాల్గొన్న భక్తులకు ప్రత్యేక ప్రసాదాలను ఆలయ సిబ్బంది అందజేశారు. ఈ పూజల్లో టిడిపి నాయకులు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ పండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.










