
ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : జగనన్న పాలనలోనే మహిళలకు పెద్దపీట వేస్తున్నారని సంక్షేమ పథకాలన్నీ మహిళలకే అనుసంధానం చేసి ఇస్తున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్, డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. మంగళవారం ఉండి కూనపరాజు సీతమ్మ అప్పలరాజు లయన్స్ కల్యాణ మండపంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పివిఎల్ నరసింహారాజు పాల్గొని అర్హులందరికీ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పివిఎల్ నరసింహరాజు మాట్లాడుతూ ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే మహిళలకు సంక్షేమ పాలన అందిస్తూ పెద్దపీట వేస్తున్నారని ప్రతిపక్షాల మినీ మేనిఫెస్టోను మహిళలు నమ్మి మళ్లీ మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రూపొందించారు అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మేలు కలిగించేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని 2024 ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రతి ఒక్కరు కఅషి చేయాలని కోరారు. ఒంటరిగానే ఎన్నికలకు వెళతామని ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన తమ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే తమ విజయం తధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీ, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, కార్పొరేషన్ డైరెక్టర్ గులిపల్లి అచ్చారావు, ఉప సర్పంచ్ కళ్యాణ్ వర్మ, రూరల్ బ్యాంక్ చైర్మన్ పేరిచర్ల సూర్యనారాయణ రాజు, నాయకులు రణస్థుల మహంకాళి, ఏడిద వెంకటేశ్వరరావు, కరిమెరక రామచంద్రరావు, జగనన్న సురక్ష మండల కన్వీనర్ బులుసు వెంకట రామకఅష్ణ, మండల స్థాయి అధికారులు, నాయకులు, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.