వాతావరణం మారినప్పుడల్లా.. జలుబు, దగ్గులు రావడం సహజం. ఓ వారం పది రోజులకు జలుబు తగ్గినా.. దగ్గు మాత్రం తగ్గదు. పొడిదగ్గు రాత్రిపూట నిద్ర పోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుంది. అలాంటి సమయంలో దగ్గుకు మందులు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే దగ్గునుంచి ఉపశమనం పొందొచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా..!
తులసి
పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే.. తులసి ఆకుల్ని నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా కొద్దిరోజులపాటు చేయాలి. ఒకవేళ మీరు తులసి ఆకుల రసాన్ని మింగలేకపోతే.. వాటి ఆకులతో టీని తయారుచేసుకోవచ్చు. ఆ టీలో తేనె కలుపుకోని తాగడం వల్ల దగ్గు సమస్య దూరమవుతుంది. తులసి ఆకుల్లోని ఔషధ గుణాలు దగ్గుకు బాగా పనిచేస్తాయి.
పసుపు పాలు
గొంతు ఇన్ఫెక్షన్లకు, దగ్గులకు పసుపు పాలు బాగా పనిచేస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగితే గొంతు నొప్పి వెంటనే తగ్గిపోతుంది. పసుపు పాలు గొంతులోని అసౌకర్యాన్ని పూర్తిగా తొలగిస్తుంది.
ఉప్పు నీరు
గోరువెచ్చని నీటితో ఉప్పు కలిపి రోజుకు కనీసం రెండుసార్లు మీ నోటిని శుభ్రం చేసుకోండి. ఉప్పునీరు గొంతు అసౌకర్యం లేకుండా చేస్తుంది. అంతేకాకుండా అనేక చర్మ వ్యాధుల నుంచి త్వరగా ఉపశమనం పొందేందుకు ఉప్పు నీరు గ్రేట్‌గా సహాయపడుతుంది. ఈ నీరు జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
హెర్బల్ టీ
కాలుష్యం, దుమ్ము వల్ల కలిగే గొంతు అసౌకర్యాన్ని తగ్గించడానికి హెర్బల్ టీ ఒక గొప్ప మార్గం. ఇది మీ ఊపిరితిత్తులను కూడా రక్షిస్తుంది. ఇందులో పచ్చి ఏలకులు, లవంగాలు వంటి మొత్తం మసాలా దినుసులు ఉండటం వల్ల వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి.