Nov 01,2022 08:09
  • ఆదాయం పెంపు కోసం రాష్ట్రానికి కేంద్రం సూచన

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆదాయం పెంచుకోవడం కోసం రాష్ట్రంలో మద్యం అమ్మకాలను మరింతగా పెంచాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర ఆర్ధికశాఖ పరిధిలోని డిపార్ట్‌మెరట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అరడ్‌ పాలసీ రీసెర్చ్‌ విభాగం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా సలహా ఇచ్చింది. రాష్ట్ర ఖజానాకు మద్యం విక్రయాల ద్వారా ఇప్పటికే భారీ ఆదాయం వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. అయినా, మరింతగా మద్యం అమ్మకాలు పెంచాలంటూ కేంద్రం సూచించడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 15వ ఆర్థిక సంఘం ఆదాయం పెంచుకోవడానికి చేసిన సిఫార్సులను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ విభాగం చేసిన సూచనలో రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా రావాల్సిన ఆదాయం రావడం లేదని పేర్కొన్నారు. రెవెన్యూ రిసీట్స్‌ (ఓఆర్‌ఆర్‌), టోటల్‌ రెవెన్యూ రిసీట్స్‌ (టిఆర్‌ఆర్‌), టోటల్‌ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ (టిఆర్‌ఇ)లను అధ్యయనం చేసిన అనంతరం సొంత పన్నుల నుండి ఎక్సైజ్‌ శాఖ ద్వారా 10.72 శాతం ఆదాయం మాత్రమే వస్తోందని కేంద్రం నిర్దారించిది. దీనిని మరింతగా పెంచాల్సిఉందని పేర్కొంది. వివిధ ఇతర ఆర్థిక వనరులకు సంబంధించి మొత్తం ఆదాయాన్ని మరో 55 శాతం పెంచుకోవాలనికూడా పేర్కొంది. అయితే, ఏ ఆదాయ వనరునుండి ఎంత, ఎలా పెంచుకోవాలో నిర్థిష్టంగా పేర్కోని కేంద్రం మద్యం విషయంలో మాత్రం స్పష్టంగా సూచించడం విశేషం.
 

                                                                             రాష్ట్రంలో ఇలా...

2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ.20,896 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, గతేడాది ఈ మొత్తం రూ.25,494 కోట్లకు చేరిపోయింది. ఇక ఈ ఏడాది కూడా అదే స్థాయిలో అమ్మకాలు సాగుతున్నాయి. ఇప్పటివరకు ఏడు నెలల్లోనే 15 వేల కోట్ల రూపాయలు దాటిపోయినట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నా మరింతగా పెంచాలని సూచించడం గమనార్హం.
రెవిన్యూ వ్యయాన్ని నియంత్రించాలి
         జిbస్‌డిపి ఆధారంగా లెక్కిరచిన ఓఆర్‌ఆర్‌, టిఆర్‌ఆర్‌లను మధ్య అరతరాన్ని ప్రస్తావించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెవిన్యూ వ్యయాన్ని నియంత్రించాలని కూడా సూచించింది,. ప్రస్తుతం టిఆర్‌ఆర్‌ 13.3 శాతం ఉండగా, ఓఆర్‌ఆర్‌ 6.7 శాతంగా ఉరదని పేర్కొంది. అదే 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఓఆర్‌ఆర్‌ 11.3 శాతంగా టిఆర్‌ఆర్‌ 8.7 శాతంగా ఉందని పేర్కొంది. దేశంలో రెవిన్యూ వ్యయం కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటని తెలిపింది.
 

                                                                   కేంద్ర నిధులు తగ్గుతాయా ?

తాజా సూచనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి వచ్చే నిధులు మరింత తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఆ సూచనలు అమలు చేస్తే రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.