ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా ఇమ్మ్జునైజేషన్ (టీకాలు)అధికారిగా డా.కె.రత్నకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇంచార్జి డిఐఓగా బాధ్యతలు నిర్వహించిన డా.ప్రభాకర్ బాధ్యతలు అప్పగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో టీకాలు, ప్రభుత్వ ప్రాధాన్యత ఆరోగ్య కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా అధికారుల సూచనలతో జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని వెల్లడించారు.అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డా.రత్నకుమార్‌ను పలువురు అధికారులు, సిబ్బంది అభినందించారు.










