
'లియో' మొదటి నుంచి చివరి వరకూ అలరిస్తుంది. ఈ సినిమా కోసం వెయ్యిమంది కంటే ఎక్కువ మంది పనిచేశారు. సంవత్సరం నుంచి వాళ్లు నిరంతరం కష్టపడ్డారు. అద్భుతమైన అవుట్‌పుట్ వచ్చింది. ఎప్పుడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని 'లియో'లో ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా మొదటి 10 నిమిషాలు మాత్రం అసలు మిస్ కాకండి. సినిమాలో ఆ పది నిమిషాలు ఎంతో ప్రత్యేకం' అని 'లియో| సినిమా తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్ చెప్పారు. విజరు నటించిన ఈ చిత్రం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపించడంతో మూవీ యూనిట్ ప్రచారాలతో ఆకట్టుకుంటోంది. అమెరికాలో వినూత్న రీతిలో కార్లు, బస్సులపై 'లియో' పోస్టర్లు అంటించి ర్యాలీ నిర్వహించారు. అలాగే కేరళలోనూ విజరు ఫ్యాన్స్ ఆయన పోస్టర్లతో భారీ బైక్ ర్యాలీ చేశారు. ఈ సినిమాలో త్రిష కథానాయిక. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.