Jul 29,2023 08:39

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ట్రాన్స్‌కో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ట్రాన్స్‌కో అదనపు కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. విద్యుత్‌ సౌధలోని చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజి నీర్‌కు 17 మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను విధు ల్లోకి తీసుకోవాలని కోరుతూ తాను లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన కార్యాలయం నుంచి అటువంటి లేఖ జారీ చేయలేదని, ఇది నకిలీదని పేర్కొన్నారు. ఆ పత్రంపై సంతకం చేసిన వారిపై తగు క్రిమినల్‌ చర్య తీసుకుంటామని తెలిపారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు, అధికారులు, ప్రజలు ఇటువంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలు, నకిలీ లేఖలపై అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్‌కోకు సంబంధించిన శాశ్వత ప్రాతిపదికన తీసుకునే నియామకాలు, ఉద్యోగ ప్రకటనలు విద్యు త్‌ సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లో, ప్రింట్‌ మీడియా ద్వారా మాత్రమే ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సేవలను థర్డ్‌ పార్టీ ఏజెన్సీ ద్వారా మాత్రమే తీసుకుంటామన్నారు.