
'రాజకీయాల్లోకి నన్ను, నా పిల్లలను లాగొద్దు. పవన్ కళ్యాణ్‌కు, నాకు సంబంధించిన అంశాలతో, సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందిస్తామని కొంతమంది వ్యక్తులు ప్రకటిస్తున్నారు. దయచేసి అలా చేయవద్దు. రాజకీయాల్లోకి పిల్లలను, మహిళలను తీసుకురావడం సమంజసం కాదు. నా వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతం చేయొద్దు' అని రేణుదేశారు అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై సినిమాలు తీస్తామని కొంతమంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా రేణుదేశాయ్ పైవిధంగా స్పందించారు.