
తరుణ్ ఆరవ తరగతి చదువుతున్నాడు. ఒకరోజు వాళ్ళ స్కూల్లో ఎకో-ఫ్రండ్స్ క్లబ్ వచ్చి పర్యావరణానికి జీవులకు ప్లాస్టిక్ వాడడవం వల్ల ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందో వివరించారు. ముఖ్యంగా జలచరాలకు పిల్లలంతా ఆ వీడియోను కుతూహలంతో చూశారు. స్కూలు అయిపోయిన తరువాత ఇంటికి వచ్చిన తరుణ్ వర్కు చేసుకుని, అన్నం తిని తన గదిలో పడుకున్నాడు. గాఢ నిద్రలో ఉన్న తరుణ్‌ను ఎవరో తట్టినట్లు అయింది. ఎవరూ! అని అన్నాడు తరుణ్. ఎదురుగా పెద్ద డాల్ఫిన్ కనిపించి ఆశ్చర్యంతో చూశాడు.
'తరుణ్! నాతో రా! వెళ్దాము' అని చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే.. 'ఎక్కడికి' అన్నాడు. వారిద్దరూ సముద్రం దగ్గరకు వచ్చారు. అక్కడ ఒడ్డున పడి ఉన్న కొన్ని పెద్ద చేపలు, ఒక పెద్ద డాల్ఫిన్ కనిపించాయి. వాటిని చూసి ఏమి జరిగింది అని అడిగాడు తరుణ్.
'మీరు వాడే ప్లాస్టిక్ వల్లే' అని చెప్పింది డాల్ఫిన్.
'మేమా?'
'అవును మీరే!. రా మా ప్రపంచం చూపెడ్తా'' అని సముద్రం లోతుకి తీసుకెళ్ళింది.
ఇంతలో జెల్లీఫిష్ లాంటివి కనిపిం చాయి. వింతగా కుతూహలంగా చూస్తుంటే..
'తరుణ్! అవేంటో తెలుసా?' అంది.
జెల్లీఫిష్ అన్నాడు.
'కాదు. మీరు వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్ధాలు. ప్లాస్టిక్ వేస్ట్.'
'సముద్రంలోకి ఎలా వచ్చింది?'
'మీ అవసరం కోసం ప్లాస్టిక్ వాడి నీటిలో అంటే సముద్రంలో, నదుల్లో పడేస్తు న్నారు కొన్ని చేపలు నీటిపై తేలుతున్న ప్లాస్టిక్‌ని ఆహారం అనుకొని తినడానికి ప్రయత్నిస్తుంటే..
'వద్దు..వద్దు' అని వెనక్కి పిలిచింది డాల్ఫిన్. 'చూశావా! మీరు పడేసిన ప్లాస్టిక్‌ను ఆహారం అనుకొని సముద్ర జీవులు తినడంతో అవి పొట్టలో ఇరుక్కుని అరగక తిండిలేక చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వస్తాయి.' చూశావుగా.
'అవునా? అయ్యో!' అన్నాడు తరుణ్
వారిద్దరూ అలా మాట్లాడుతుంటే జాలరులు చేపలను పట్టి వలను పక్కకు ఉంచారు. తరుణ్ ఆ వలను తెంపి వాటిని నీటిలోకి వదిలి కాపాడాడు.
'బతుకు జీవుడా అని అవి వెళ్ళిపోయాయి. మానవులు చెడ్డవారు అనుకున్నాము. కానీ వారిలో మంచివారు కూడా ఉన్నారని తెలిసింది. తరుణ్!' అంది డాల్ఫిన్.
'వంద సంవత్సరాల ముందు ప్లాస్టిక్ లేదు. దీంతో నీటిలో జలచరాలు హాయిగా ఉండేవి. ఎప్పుడైతే మీరు ప్లాస్టిక్ వాడటం ఎక్కువ చేశారో.. మాకు బాధలు మొదలయ్యాయి. 1950 నుండి ఇప్పటి వరకూ లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రంలో పడేశారు. నువ్వెప్పుడూ ప్లాస్టిక్ నీటిలో పడేయలేదా!' అని అడిగింది.
పడేశాను అన్నాడు సిగ్గు పడుతూ..
'ప్లాస్టిక్ తక్కువ వాడండి. వాటిని మళ్ళీ ఉపయోగించండి (రీసైక్లింగ్) చేయండి.' అంది డాల్ఫిన్.
'సమయం చాలా అవుతోంది. ఇంటికి వెళ్దాం'. అంటూ తరుణ్‌ని ఇంట్లో దింపి 'తరుణ్! మమ్మల్ని సేవ్ చేస్తావుగా!' అని దిగులుగా అడిగింది. 'తప్పకుండా నా మిత్రమా' అని తరుణ్ ఎంతో ప్రేమగా డాల్ఫిన్‌ని హగ్ చేసుకున్నాడు. కల ముగిసి నిద్ర లేచాడు తరుణ్.
సముద్రాలను, జలచరాలను ప్లాస్టిక్ భూతం నుండి సేవ్ చేద్దామా?
పి. కృతిక
6వ తరగతి, విజరు హైస్కూలు,
నిజామాబాద్, తెలంగాణ.