Jan 05,2023 12:19

ఇంటర్నెట్‌డెస్క్‌ : అవిసెగింజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని క్రమంతప్పకుండా తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్‌ కారకాలను నిరోధించే ఈ గింజలు.. బరువు తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. మరి బరువు తగ్గాలనుకునేవాళ్లు... ఆరోగ్యకరమైన అవిసెగింజల టీని తీసుకుంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ టీ వల్ల ఇంకెన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందామా..!

ఫ్లాక్స్‌ సీడ్స్‌ టీ
ఒక కప్పు నీటిలో ఓ టేబుల్‌ స్పూను అవిసెగింజల్ని వేసుకుని ఐదు లేదా పదిమినిషాలపాటు మరిగించుకుని ఆ నీటిని వడకట్టుకుని అందులో తేనె కలుపుకుని తాగాలి. ఇలా తయారుచేసుకున్న అవిసెగింజల టీని తాగితే.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.
- రోజూ పడుకునే ముందు ఈ టీని తీసుకుంటే మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
- మధుమేహస్తులు అవిసెగింజల టీని తీసుకుంటే.. షుగర్‌ పెరగకుండా... నియంత్రణలో ఉంచుకోవచ్చుని వైద్యులు చెబుతున్నారు. అలాగే జుట్టు ఆరోగ్యంగానూ ఉంటుందని డాక్టర్‌ దిగ్విజరుసింగ్‌ చెప్పారు.