ఇంటర్నెట్‌డెస్క్ : వంటింట్లో ప్రధానంగా కనిపించేవి పచ్చిమిర్చినే కదా. రోజూ పచ్చిమిర్చిని ఆహారంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!
- మిరపలో ఉండే క్యాప్సైసిన్ ఘాటైన రుచిని అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్ అయిన ఈ క్యాప్సైసిన్ ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే వైద్యులు బరువు తగ్గాలనుకునేవారు.. తరచూ పచ్చిమిర్చిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
- ఫినోలిక్ ఆమ్లాలు, కెరోటినాయిడ్లు, ఆస్కార్బిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రేగు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మణిపాల్ హాస్పిటల్ డైటీషియన్ వైశాలివర్మ చెప్పారు.
- పచ్చిమిర్చి రోగ నిరోధక వ్యవస్థపై బాగా ప్రభావం చూపుతుంది. ఇందులో ఉండే క్యాప్సైసిన్ యాంటీ మైక్రోబయల్ లక్షణాల్ని కలిగి ఉంటాయి. ఇవి వ్యాధికారక సూక్ష్మజీవుల నిరోధకంగా పనిచేస్తాయి.