కొత్తసంవత్సరానికి స్వాగతం
పాత సంవత్సరానికి వీడ్కోలు
కొంగొత్త ఆశలతో
ఆకాంక్షలతో
సుఖ సంతోషాలతో
శాంతి సౌభాగ్యాలతో
ఆత్మీయత అనురాగంతో
ఆప్యాయత అభిమానంతో
ఆదరణ ఆనందంతో
ఆర్థ్రత సౌహార్ధ్రతతో
బంధాలు అనుబంధాలతో
ప్రేమ క్షమ దయార్ధతతో
సహకారం సమన్వయంతో
సహనం సంఘీభావంతో
స్నేహ సౌభ్రాతృత్వంతో
సమత మమత సమైక్యతతో
సామరస్యత మానవీయత
పరిమళ భరిత భవితకు
భద్రతకు నూతన వత్సరం
బాట కావాలి
కుళ్ళు, కుతంత్రాల
కుట్రల, కుయుక్తుల ఆట కట్టాలి
పగలు పంతాలు కల్మషం కాలుష్యం
కాఠిన్యం కలహాల కట్టడితో
అగ్రవాదం ఉగ్రవాదం
ఉన్మాదం అంతరించి
స్వచ్ఛ భారత్.. స్వయం సమృద్ధ
స్వాభిమాన భారత్
అవతరించాలి
సమాజహిత ఆశావహులమౌదాం
వెలుగులు విరజిమ్మే దివ్వెలమౌదాం
నేదునూరి కనకయ్య
9440245771