Jan 31,2023 13:00

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : నందిగామ మండలం పెద్దవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు గ్రామ నాయకులు ఇంటూరి సీతయ్య రూ.5 వేలు విలువ చేసే ఆటవస్తువులను మంగళవారం విద్యార్ధులకు పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు చంద్ర మోహన్‌, బాలకృష్ణలు రూ.2 వేలు చొప్పున వాలీబాల్‌, బ్యాట్‌ మెంటెన్‌ క్రీడా సామాగ్రిని అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.విజయలక్ష్మీ, పిఇటి కొట్టు వెంకటేశ్వర్లు, గ్రామ పెద్థలు, విద్యార్ధీని విద్యార్ధులు పాల్గొన్నారు.