ప్రజాశక్తి-కారంచేడు (బాపట్ల) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాల పిల్లలకు మంగళవారం నాడు ప్రవేశపెట్టిన రాగి చావ కార్యక్రమాన్ని మండలంలోని దగ్గుబాడు గ్రామపంచాయతీలో పాఠశాలలో మంగళవారం ప్రారంభించారు. గ్రామంలోని ఉర్దూ పాఠశాల మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో దగ్గుబాడు గ్రామపంచాయతీ సర్పంచి గ్యార రవీంద్రనాథ్ ఠాగూర్, కార్యదర్శి జోష్ణలు కలిసి విద్యార్థిని విద్యార్థులకు రాగి జావను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటు ఎంపీపీ మెయిన్ పాఠశాల హెచ్‌ఎం భవనం శ్రీనివాస్ రెడ్డి, మండల పరిషత్ పాఠశాల హెచ్‌ఎం మల్లికార్జున, ఉర్దూ పాఠశాల హెచ్‌ఎం వాసు , ఉపాధ్యాయులు పుష్పలత, నిర్మల, తదితరులు ఉన్నారు.










