May 17,2023 16:35

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం ఎల్లవేళలా దళితులకు అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివఅద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. బలగం సినిమాలో తమ పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున దళిత బంధు పథకం కింద రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కారును అందించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, సుంకె రవిశంకర్‌, జోగినపల్లి శ్రీనివాసరావు, బేడ బుడగ జంగాల జేఏసీ చైర్మన్‌ టి.జగదీశ్వర్‌, వైస్‌ చైర్మన్‌ చింతల యాదగిరితో పాటు తదితరులు పాల్గన్నారు.
ఈ సందర్భంగా మొగిలయ్య, కొమురమ్మ దంపతులు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కఅతజ్ఞతలు తెలిపారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలిచిన మంత్రులు హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, బేడ బుడగ జంగాల జెఎసి చైర్మన్‌ టి.జగదీశ్వర్‌, వైస్‌ చైర్మన్‌ చింతల యాదగిరిలకు కఅతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే బేడ బుడగ జంగాల ప్రతినిధిగా చింతల యాదగిరికి తగిన పదవి ఇచ్చి, గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.