Oct 08,2023 12:24

చాలామంది భావించినట్టు మధుమేహం ఓ వ్యాధి కానేకాదు. ఇదొక శారీరక పరిస్థితి. భోజనం, వ్యాయామం, వైద్యంతో నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమే. ఆ ప్రయత్నంలో కొన్ని మనకి అందుబాటులో ఉన్నవి ఎంతగానో ఉపకరిస్తాయి. అలాంటివి కొన్నింటిని గురించి తెలుసుకుందాం.
పసుపు: ఇందులోని కొన్ని మూలకాలు మధుమేహాన్ని అడ్డుకుంటాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అధ్యయనాలూ నిరూపించాయి.
మెంతులు: వీటికి బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయిని ఇరవై నాలుగు శాతం మేర తగ్గించే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అలోవిరా: నిపుణుల పర్యవేక్షణలో జ్యూస్‌ రూపంలో తీసుకుంటే కనుక, కొద్ది నెలల వ్యవధిలోనే మధుమేహం ప్రభావం సగానికి సగం పడిపోతుందని పరిశోధకులు గుర్తించారు.
అల్లం: మితిమీరిన గ్లూకోజ్‌ కారణంగా శరీర వ్యవస్థలో వచ్చే చెడు మార్పులను నిరోధించే శక్తి ఉన్న దినుసు అల్లం. ఇది లోపలి వాపులను, గాయాలను కూడా మానుస్తుంది.
ఉల్లి: మధుమేహ రోగులకు ఉల్లి తల్లిలా మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎలుకలపై జరిపిన ఓ పరిశోధన ఫలితాలతో ఈ నిర్ధారణకు వచ్చారు.
కరివేపాకు: ఇందులో విటమిన్‌-సి ఉంటుంది. మధుమేహ రోగులకు ఉత్తమ ఆహారం.
కాకరకాయ: మధుమేహం విషయంలో ఈ జ్యూస్‌ సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ-డయాబెటిక్‌ గుణాలు అపారం.