ప్రజాశక్తి కాకినాడ : ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకునేందుకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. కాకినాడ కలెక్టరు కార్యాలయంలో మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాల్లో వివిధ మండలాల నుంచి 15 మంది విద్య, ఉపాధి, భూ సర్వే, భూ సమస్యలు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి లైట్లు, శ్మశాన వాటికల అభివృద్ధి వంటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ 18004253077కు ఫోన్ చేసి జిల్లా కలెక్టరుకు నేరుగా తెలియజేశారు. కలెక్టరు కృతికాశుక్లా మాట్లాడుతూ ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో నమోదు అయిన వినతులను నిర్ణీత సమయంలో పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యల్ని ప్రజల నుంచి నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫోన్ ద్వారా తెలియజేసిన 15మంది వ్యక్తుల సమస్యల పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. నమోదైన సమస్యలపై ప్రత్యేక దష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని కలెక్టరు కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో కె. శ్రీధర్ రెడ్డి, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.










