Jul 11,2023 14:45

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ : జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రతి మంగళవారం ఉదయం 11గంటల నుండి 12గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమానికి మొత్తం 19 మంది ఫోన్‌ చేసి ఫిర్యాద చేసినట్లు ఎస్పీ సతీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రతి కాలర్‌తో వారి సమస్యను సవివరంగా అడిగి తెలుసుకుని మాట్లాడిన ఎస్పీ నిర్ణీత వ్యవధిలో వారి సమస్య పరిష్కారం అయ్యేలా జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సంబధిత పోలీసు అధికారులను ఆదేశించారు. మూడు వారాలలో అందిన 48 ఫిర్యాదులలో 22 ఫిర్యాదులను సంబధిత పోలీస్‌ స్టేషన్ల అధికారులు పరిష్కరించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.