బాపట్ల : ఉపాధి పనులు చేసే కూలీలకు వంద రోజులు తగ్గకుండా పని కనిపించాలని కోరుతూ ... జూన్ 5వ తేదీన బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను అందరూ జయప్రదం చేయాలని ... ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం బాపట్ల జిల్లా బాపట్ల మండలంలోని మూలపాలెం గ్రామాల్లోని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో నేతలు వ్యవసాయ కూలీల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఈనెల 5వ తేదీన ఉపాధి సమస్యల పరిష్కారం పై కలెక్టరేట్ వద్దకు రావాలని కూలీలను కోరారు.
ఈ సందర్భంగా ఉపాధి కూలీలను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కఅష్ణమోహన్ మాట్లాడుతూ ... కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి భారీగా నిధులు తగ్గించడం వల్ల ఉపాధి కూలీలు పనిచేసే చోట కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి కూలీలు ఫోటో యాప్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం పనిచేసే చోట టెంటు సౌకర్యం గాని, మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్టు, ఇతర బీమా సౌకర్యం లేకపోవడం అన్యాయం అన్నారు. ఈ సౌకర్యాలు లేకపోవడంతోనే తీవ్రమైన ఎండలు ఉండడంతో వడదెబ్బ తగిలి కూలీలు మరణించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఇచ్చే బీమా సౌకర్యం కూడా ఇవ్వడం లేదన్నారు. తక్షణమే పై స్థాయి అధికారులు ఇలాంటి సమస్యలను గుర్తించి పై అధికారుల దఅష్టికి తీసుకెళ్లి, సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలతో జూన్ ఐదో తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతుందని ప్రకటించారు. కూలీలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేస్త్రీలు బాబురావు, ఎస్తేరు రాణి, కళావతి, మేరెమ్మ జ్యోతి, కూలీలు పాల్గొన్నారు.










