విజయవాడ : 4 నెలలుగా అందని ఉద్యోగ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ .... సోమవారం ఉదయం విజయవాడలోని అలంకార్ సెంటర్ వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు. మినిమం టైమ్ స్కేలు అమలు చేయాలని, అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని, సమగ్ర శిక్షా అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.