- జిఓ 39 విడుదల
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు కల్పిస్తున్నట్లుగానే అవుట్‌సోర్సింగ్/ కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు ఏడాదిలో 5 ప్రత్యేక సాధారణ సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిఓ ఎంఎస్ నెంబరు 39ని మంగళవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగులకు ఏడాదికి 15 రోజులు సాధారణ సెలవులు (క్యాజువల్ లీవ్స్) ప్రభుత్వం ఇస్తుండగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో మహిళా ఉద్యోగులకు అదనంగా 5 రోజుల సెలవులు మంజూరవుతాయి.