ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లను జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంగళవారం మండల కేంద్రమైన తుగ్గలిలో వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల కమిటీ అధ్యక్షులు జిట్టా నగేష్ యాదవ్, వైసిపి వింగ్ జిల్లా కార్యదర్శి తుగ్గలి మోహన్ రెడ్డి, సచివాలయం మండల కన్వీనర్ హనుమంతు మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వాలింటర్లుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడటం అవివేకం అన్నారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలన్నారు. అనంతరం తుగ్గలి పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర రెడ్డి, రాతన మోహన్ రెడ్డి, జడ్పిటిసి పులికొండ నాయక్, టీఎండ్ హుస్సేన్, వైస్ ఎంపీపీలు మల్లికార్జున రెడ్డి, ఎర్ర నాగప్ప,మాజీ జెడ్పిటిసి జగన్నాథరెడ్డి, నారాయణ నాయక్, కో ఆప్షన్ సభ్యులు చాంద్ భాష, తుగ్గలి చంద్రశేఖర రెడ్డి, మాజీ సొసైటీ డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డి, ఉమామహేశ్వర రెడ్డి, బసిరెడ్డి వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, మండలంలోని వాలంటీర్లు పాల్గొన్నారు.










