ప్రజాశక్తి - పెద్దాపురం(కాకినాడ) : అంగన్వాడీల గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులు,అణచివేతలకు నిరసనగా సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ సెంటర్‌లో మంగళవారం ధర్నా,అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి దారపురెడ్డి క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వేతనాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం కర్కసంగా వ్యవహరిస్తోందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టాన్ని అంగన్వాడీలకు అమలు చేయమని అడిగితే పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారన్నారు. ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న టిఏ బిల్లులను చెల్లించమని అడిగితే గృహనిర్బంధాలుకు పాల్పడుతున్నారన్నారు. అంగన్వాడీల పోరాటానికి ఆశా వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం, మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్‌లు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, అంగన్వాడి యూనియన్ నాయకులు టి.ఎల్ పద్మావతి, చంటి, కాలే దేవి, జే.కుమారి, రమణమ్మ, వన.కుమారి, వసంత, తులసి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు నాగమణి, లోవ కుమారి, మిడ్ డే వర్కర్స్ యూనియన్ నాయకులు కరక సుబ్బలక్ష్మి,పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వడ్డి సత్యనారాయణ, తైనాలి శ్రీను, సిపిఎం నాయకులు నీలపాల సూరిబాబు, సిరపరపు శ్రీనివాస్, ప్రజానాట్యమండలి నాయకులు కేదారి నాగు,దారపురెడ్డి కృష్ణ, గరగపాటి పెంటయ్య, మహపాతిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.











