Sep 26,2023 16:07

ప్రజాశక్తి కాకినాడ : అంగన్వాడీల పట్ల జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి గహ నిర్బంధాలను, ముందస్తు అరెస్టులను, అంచివేతకు పాల్పడడాన్నీ వ్యతిరేకిస్తూ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కాకినాడ, అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వరరావు, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.జ్యోతి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం తెలంగాణా కంటే అదనంగా చెల్లిస్తానన్న హామీ అమలు చేయమని శాంతియుత ఆందోళన చేస్తున్న అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టాన్ని అంగన్వాడీలకు అమలు చేయమని అడిగితే పోలీసుల ద్వారా అరెస్టులు చేయించిందని, ఐదేళ్ల నుండి పెండింగ్‌ పెట్టిన టిఏ బిల్లులను చెల్లించమని కోరితే గహనిర్బంధానికి పాల్పడిందని విమర్శించారు. అణిచివేత ద్వారా, నిర్బందాల ద్వారా పరిపాలన సాగించాలని జగన్ను ప్రభుత్వం భావిస్తుందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడుతామని హెచ్చరించారు. అంగన్వాడీలకు పోలీసులు, అరెస్టులు, కేసులు కొత్తేమీకాదని, గత ప్రభుత్వాలు ఇలాంటివి ప్రయోగించే అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని జగన్‌ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. కరెంటు చార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్న జగన్‌ ప్రభుత్వానికి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కనీసజ్ఞానం లేదా అని ప్రశ్నించారు. పోరాడేతత్వం కలిగిన అంగన్వాడీలతో దురుసుగా వ్యవహరించి జగన్‌ తనరాజకీయ భవిష్యత్తును కోల్పోవాల్సి వస్తుందని గుర్తించుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో మొత్తం కార్మికవర్గం అంగన్వాడీ పోరాటాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి, నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, పెన్షనర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్తిరాజు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, చెక్కల వేణి, జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు విజయ కుమార్‌, దుర్గాప్రసాద్‌, ఏఐటీయూసీ నాయకులు భాను, రామయ్య, అనిల్‌, బంగారు రాజేష్‌, వెంకటరమణ, వరప్రసాద్‌, సుబ్బలక్ష్మి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ డ హెల్పర్స్‌ యూనియన్‌ సభ్యులు విజయ, జోగమ్మ, సరోజిని, సీతా, మున్నీ, రమా, నాగశేషు, తులసి, సౌజన్య, దీప్తి తదితరులు పాల్గొన్నారు.