
ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన అక్రమ కేసులలో న్యాయస్థానంలో ధర్మమే జయిస్తుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి 28 రోజులుగా జైల్లో రిమాండ్ లో ఉంచడం బాధాకరమని అందుకు నిరసనగా టిడిపి కార్యాలయం వద్ద ప్రతిరోజు నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలోను, దేశ విదేశాలలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన తెలియజేస్తున్నారని అన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహానేత పై అక్రమ కేసులు బనాయించడం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికలలో వైసీపీకి తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాయుడోరి రమణ, జయప్రకాష్,కొమ్మ శివ,దుద్యాల జయచంద్ర అనిత దీప్తి,రామచంద్రయ్య,బాలాజీ,గిరిధర్ నాయుడు,పి రమేష్, తులసి వెంకటేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.