Oct 15,2023 16:20

ప్రజాశక్తి-అన్నవరం(కాకినాడ) : అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహౌత్సవాలను దేవస్థానం అధికారులు ఆరంభించారు. ఆదివారం ఉపాలయాలుగా ఉన్న వనదుర్గ కనకదుర్గ ఆలయాల్లో అమ్మవార్లను రోజుకొక దుర్గమ్మలుగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అదే విధంగా ఉదయం సాయంత్రం వైదిక పరంగా పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేవస్థానం వ్రత పురోహితుల సంఘం సహకారంతో సుమారు 9 లక్షల విలువ గల మంచి ముత్యాలతో అల్లిన వస్త్రాలను పురోహితులు దేవస్థానం అధికారులకు అందజేశారు. వీటిని ప్రతి సోమవారం ప్రధానాలయంలో ఉండే స్వామి అమ్మవారికి శివుడు ఉన్న మూల వరులకు అలంకరించి ముత్తంగి సేవ నిర్వహించనున్నారు.