ప్రజాశక్తి-నందిగామ(ఎన్‌టిఆర్) : నందిగామ మండలం ఐతవరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు మంగళవారం జరిగాయి. గ్రామ సచివాలయ భవనాన్ని, రైతు భరోసా కేంద్ర భవనాన్ని, వైయస్సార్ విలేజ్ క్లినిక్ భవనాన్ని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ , నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించిన అతిథులను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఘనంగా సత్కరించారు. వారికి జ్ఞాపికలను అందజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.










