ఇటలీ టస్కానీలో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహంలో మెగా బ్రదర్స్ నాగబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల ఫొటో వైరల్‌గా మారింది. నాగబాబు ఈ ఫొటోను షేర్ చేస్తూ అన్నదమ్ముల బంధం గురించి ఓ ఎమోషనల్ నోట్ రాశారు. 'మా మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా.. మా అన్నదమ్ముల బంధం ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఈ ఫొటో ఓ జ్ఞాపకం మాత్రమే కాదు అంతకు మించింది. మా మధ్య ఉన్న అభిప్రాయ భేదాల కంటే లోతైన అనుబంధం చాలా ముఖ్యమైనది. ప్రేమతో కూడిన ఎన్నో మధుర క్షణాలతో ఈ రిలేషన్ ముడిపడి ఉంది. ఇది ఎప్పటికీ విడదీయరానిది. బలమైనది. దీనికి నేనెంతో విలువనిస్తాను'' అంటూ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా, సినీ ప్రముఖుల కోసం ఈనెల ఐదోతేదీన మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ వేదికగా వరుణ్‌తేజ్ - లావణ్య వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.