మన భరతజాతి
ఖ్యాతి విస్తృతి
తెలుప పాడుదాం
భవ్య దివ్య గీతి
గళం విప్పి ఎలుగెత్తి
మన సజీవ సంస్కృతి
గంగ బ్రహ్మపుత్ర
మహానది గోదావరి
కృష్ణా కావేరి
సింధు, నర్మద, తపతి
నదుల పుణ్యభూమి
గదా మరి ఇది
ఆర్థిక సాంఘిక వాణిజ్య
రంగాన విస్తరింపగ
విదేశీయుల పాలనలో
వివిధ రకాలుగా విసిగి
వినమ్రంగా సాధించిన
స్వాతంత్య్రం సాక్షి
మన భరతజాతి
ఖ్యాతి ప్రగతిదారుల
పయనించి మనమంతా
విశ్వ యవనికపైన
నిలుపుదాం నిలువెత్తు
మన నిండైన కీర్తి
దేశమ్ము కోసమై
స్వాతంత్య్ర
ఆశయమ్ము వదలక
దేహమ్ములు త్యజియించిన
వీర భరతపుత్రుల
మనసారా స్మరియించి
మన దేశ విఖ్యాతిని
మారుమ్రోగిద్దాం జగతిన...
డా చిట్యాల రవీందర్
77988 91795