
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం లోని స్థానిక బాలాజీ జుంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ ని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంపడపు విజయలక్ష్మి, ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంపడపు విజయలక్ష్మి మాట్లాడుతూ పండగ సందర్భంగా ఇలాంటి మంచి వినూత్నమైన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అని తెలిపారు. ప్రజలు ఉత్సాహంగా గడిపేందుకు ఎంతోగానో ఉపయోగపడుతుంది అని తెలిపారు. నిర్వహుకులుకి మంచి లాభాలు తెచ్చిపెట్టాలి అని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ అధినేత శ్రీనివాస్ రెడ్డి, గోల్డ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.