ఎవరు వెంటాడుతున్నారో తెలీదు..
భయం గుప్పిట్లో కాలం వ్రేల్లాడడం ఆగదు.
నిమిషాలూ గంటలూ
రోజులదండకి గుచ్చబడుతూ ఉంటాయి.
సమాధానం దొరకని బిక్కచూపు.
సరళంచేయబడని త్రోవలు.
ఎటువెళ్ళాలో తొయ్యదు.
రాళ్ళుపడతాయని భయం.
ఆకు కదులుతుందేమోగానీ..
భయం అంగుళంమాత్రమూ జరుగదు.
ఎటువిన్నా
రాకాసి స్వరాలు.
లోపలలోపల
భయంకర నిశ్శబ్దం
పొంతన కుదరని తడబాటు.
ఎన్నెన్నో సందేహాలు.
సందేహాల చివరన శూన్యం.
నిర్వికార దృశ్యబంధనం.
చివరాకరున..
ఉన్నపళాన కుప్పకూలడం.
బండి అనురాధ