ఇంటర్నెట్‌డెస్క్ : దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయి. దోమల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమతెరల వాడకం కానీ, మస్కిటో నెట్స్ ఉపయోగించడం వంటి పద్ధతుల ద్వారా దోమల్ని నివారించవచ్చు.
- డెంగ్యూ ప్రాణాంతకం కానప్పటికీ.. శరీర రోగనిరోధకశక్తిపై చాలా ప్రభావం పడుతుంది. బంగ్లాదేశ్, భారత్, థారులాండ్ వంటి దేశాల్లో కోవిడ్ - డెంగ్యూ ఈ రెండు వ్యాధులు ఒకేసారి అటాక్ అయినట్లు పరీక్షల్లో వెల్లడైనట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే డెంగ్యూ వ్యాధికి తప్పనిసరిగా వెంటనే చికిత్స అందించాలి.
- డెంగ్యూ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవాలంటే.. బొప్పాయి ఆకుల జ్యూస్ తాగితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల.. రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
- డెంగ్యూ సోకితే.. తీవ్రమైన తలనొప్పి, కళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.