Jul 24,2023 10:21

పోర్టు అవ్‌ ప్రిన్స్‌ : హైతీ మళ్లీ రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రధాని ఏరియల్‌ హెన్రీ వట్టి అసమర్థ పాలనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించలేని అచేత నావస్థలో ప్రధాని ఉన్నారని, దేశ సమైక్యతను కాపా డేందుకు వివిధ రాజకీయ గ్రూపులను కలుపుకు పోవడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. హెన్రీ పాలనలో ప్రజలు అనేక కష్టనష్టాలకు గురవుతున్నారని, ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలిపేందుకు కూడా అవకాశమివ్వడం లేదని హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఈ అభధ్రత నుంచే తీవ్రవాదం పుట్టుకొస్తుందనే విషయం మరచిపోరాదని వారు హెచ్చరిస్తున్నారు. క్రిమినల్‌ గ్యాంగ్‌లు, అరాచక మూకలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటుంటే ప్రభుత్వం చేష్టలుడిగినట్టు వ్యవహరిస్తోందని పేర్కొంటున్నారు.ప్రధాని తప్పుకోవాలంటూ శనివారం పోర్ట్‌ అవ్‌ ప్రిన్స్‌లో భారీ ర్యాలీ జరిగింది. పార్లమెంటుకు తిరిగి ఎన్నికలు జరపాలని, ప్రధాని తప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.