Jun 30,2023 12:11

ఇంటర్నెట్‌డెస్క్‌ : పిరియడ్స్‌ రెగ్యులర్‌గా రావడం లేదా? అయితే తప్పనిసరిగా మీ అలవాట్లు మార్పు చేసుకోవాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యం సరిగ్గా ఉండి కూడా రుతు క్రమ సమస్యలు ఎదుర్కొంటుంటే వైద్యుల సూచనలను పాటించాలి. ప్రధానంగా మహిళలు తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాగే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ వీలు కాకపోయినా.. వారంలో కనీసం నాలుగైదు రోజులు వ్యాయామం చేయాలి.
- ప్రతిరోజూ వాకింగ్‌, రన్నింగ్‌ వంటి వ్యాయామాలు చేయకపోయినా.. తప్పనిసరిగా యోగా చేస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. యోగాసనాల ద్వారా హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయని, అవి రుతుక్రమ సమస్యలకు ప్రతికూల ప్రభావం లేకుండా చూపుతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. ప్రొద్దునే యోగా చేయడం ద్వారా పిరియడ్‌ సమస్యలకు కొంతవరకు ఉపశమనం పొందవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.