Jun 06,2023 11:16

సి బెళగల్‌ (కర్నూలు) : డిగ్రీ విద్యార్థి హత్యకు గురైన ఘటన మంగళవారం సి బెళగల్‌ మండలంలో జరిగింది. కృష్ణదొడ్డి కొండల్లో కృష్ణదొడ్డికి చెందిన వెంకటేష్‌, లక్ష్మి దంపతుల రెండో కుమారుడు, డిగ్రీ విద్యార్థి బోయ వెంకట్‌ (21) హత్యకు గురయ్యాడు. వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.