Jan 29,2023 12:47

నర్సీపట్నం (అనకాపల్లి) : జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్‌ రాజాన వీరసూర్యచంద్ర ఆరోగ్య క్షీణిస్తుంది. గొలుగొండ మండలం చీడిగుమ్మల, యర్రవరం నుంచి అరిలోవ అటవీ ప్రాంతం వరకు మూడు కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అలాగే నాతవరం తాండవ రోడ్డును తక్షణమే అభివృద్ధి చేయాలంటూ సూర్యచంద్ర శనివారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్ష ఆదివారం రెండో రోజు కూడా కొనసాగింది. ఆరోగ్యం క్షీణిస్తునప్పటికీ సూర్యచంద్ర దీక్షను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా సూర్యచంద్ర చేస్తున్న దీక్షలకు పలువురు సంఘీభావం తెలియజేస్తున్నారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేసి దీక్షలో కూర్చుంటున్నారు. సూర్యచంద్రకు ప్రభుత్వ వైద్యుని సమక్షంలో నర్సులు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోడ్ల నిర్మాణాలపై స్పష్టమైన హమీ ఇచ్చేంతవరకూ తన దీక్ష విరమించేది లేదని సూర్యచంద్ర మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య, టౌన్‌ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్‌ తో పాటు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.