Dec 11,2022 12:28

రక్తనాళాలు చిట్లేలా
అరుస్తున్న శాపగ్రస్థుల
ఆకలి కడుపులు..
కసాయి చర్మం వలిచేటప్పుడు
విలవిల్లాడే గొడ్లలా
పట్టెడన్నం కోసం ఆక్రందనలు..
తినిపారేసిన ఎంగిలాకులకు
కాకులు కుక్కలతో
కుప్పతొట్టిదగ్గర తోపులాటలు..
పరమాన్నం తింటున్న
పైసలున్న వాడి దయకోసం
తింటున్న చీదరింపులు..
కాయ కష్టం చేసిచేసి
గంజినీళ్లతో సరిపెట్టుకునే
దీనులు.. హీనులు..
ఇదే ఇదే తరతరాలుగా
మారని అభాగ్యుల
శాపాలు.. పాపాలు..
ఆ శాపం నశించదా..!
ఆ పాపం పండదా..!
అభాగ్యులు కడుపునిండదా..!
ఆకలి చావులు ఆగవా..!
కరువెరుగని కర్షక లోకం
రావా.. రావా..!
 

నాగముని. యం, 9490856185,