
భారతీయుల వంటకాల్లో కరివేపాకు సర్వసాధారణంగా వాడుతుంటారు. చాలామంది దీన్ని కేవలం రుచి కోసమే వేస్తారని అనుకుంటారు. పక్కకు తీసి పడేస్తుంటారు. కరివేపాకులో అనేక ఆరోగ్య సంబంధ ఔషధ గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అందువల్ల కేవలం వంటల్లోనే కాకుండా వివిధ ఔషధాల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయానికి రక్షణ కల్పిస్తాయి. జుట్టు సమస్యలను నివారణకు, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్తి, ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది.
చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోపడతాయి. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గిస్తుంది. ఆమ్లశ్రావం, జీర్ణ పూతలు, ఎముకల అరుగుదలకు, డయాబెటిస్, అతిసారం, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలను నియంత్రిస్తుంది. వేర్లను శరీర నొప్పులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. హైపర్లైసీమిక్ డయాబెటిక్ డయాబెటిక్ రోగుల రక్త గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. జుట్టు మూలాలను బలపరుస్తుంది. పెరుగుదలకు సహకరిస్తుంది.