
దోపిడీకి బలవుతున్న విశ్వమానవుడు పోషించాల్సిన పాత్ర ఏమిటి? మూడు ఖండాల ప్రజలు వియత్నాం పరిణామాలను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. పాఠాలు నేర్వాలి. యుద్ధం అన్నది సామ్రాజ్యవాదం ప్రపంచ ప్రజలకు చూపించే బూచి. అందువల్ల యుద్ధం అనగానే భయాందోళనలకు లోనుకావటం తెలివైన పని కాదు. ఘర్షణ జరుగుతున్న అన్ని ప్రాంతాల్లోనూ, కోణాల్లోనూ ప్రజలు సాయుధులై తిరగబడటమే అందరి ఎత్తుగడగా ఉండాలి. లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాలే ప్రధానంగా సామ్రాజ్యవాద దోపిడీకి బలైన ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ దేశాల్లో దేనికదే ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నాయి. అదే సమయంలో మూడు దేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి కారణాలు విషయంలో ఉమ్మడి లక్షణాలు కలిగి ఉన్నాయి. లాటిన్ అమెరికా దేశాలు కుడిఎడంగా ఒకే స్వరూప స్వభావాలు కలిగిన దేశాల చేతుల్లో బందీలుగా ఉన్నాయి. మరో క్యూబాను అంగీకరించబోము అన్న నినాదం మాటున ప్రతిఘటనతో నిమిత్తం లేకుండా ఏ దేశంలో ఆకులు కదలాడినా విచ్చలవిడిగా మారణకాండకు దిగుతున్నాయి. డొమినికన్ రిపబ్లిక్‌లో జరిగిన పరిణామాలు కానీ, పనామా నరమేధం కానీ ఈ విషయాన్నే రుజువు చేస్తున్నాయి. లాటిన్ అమెరికాలో అమెరికాకు బంటుగా ఉన్న ఏ ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం జరిగినా, తన ఆర్థిక భౌగోళిక ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితులు తలెత్తినా అగ్రరాజ్యం ఉగ్ర రూపం దాల్చి బాంబులతో నేరుగా రంగంలోకి దిగటానికి వెనకాడనని పదేపదే హూంకరిస్తోంది. అమెరికా. ఈ దుందుడుకు విధానం నిర్నిరోధంగా సాగుతోంది. అమెరికా దేశాల సంస్థ (ఓఏఎస్) దీనికి ఓ ముసుగుగా మారింది.
- లాటిన్ అమెరికాలో సామ్రాజ్యవాదుల కుట్రలపై చే గువేరా
''మా ప్రాణాలైనా వదులుకుంటాం. కానీ సోషలిజాన్ని వదులుకోం'' అనే మాటాలు స్పష్టంగా వినిపిస్తాయి. ప్రజల్లోని ఆ సోషలిస్టు చైతన్యమే నేటికి క్యూబాలో సోషలిజాన్ని కాపాడుతున్నది. అందరికీ చదువు, అందరికీ పని, అందరికీ ఇళ్ళు, అందరికీ వైద్యం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులుగా అమలు జరుగుతున్నాయి. పని చేసేవారిలో అసమాతలు లేవు. డైలీ, క్యాజువల్ పద్ధతుల్లో పనులు ఉండవు. అందరూ పర్మినెంట్ ఉద్యోగులే. ప్రజలంతా ఆరోగ్యంగా వుంటారు.
చేగువేరా జీవితం నాటికీ నేటికీ విప్లవ శ్రేణులకు ఎంతో స్పూర్తినిస్తుంది. ఆయన డైరీలో రాసుకున్న చివర వాక్యాలు లాటిన్ అమెరికా గతినే మార్చేశాయి.'సాధారణ కుర్రకారుగా బయలుదేరిన చే గువేరా.. నేను ఇంక ప్రజలతోనే వుంటాను. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలున్నా దాటుకుంటూ ఎంతమంది గొంతుచించుకొని ఏడ్చినా కసితో నాకు ఎదురుపడ్డ దుర్మార్గపు శత్రువుని కర్కశంగా నా కత్తిపై బలి ఇస్తాను' అని ముగించారు. క్యూబా తరువాత బొలీవియాలో విప్లవ సాధన తన లక్ష్యంగా ఎంచుకున్నారు. అమెరికా కుట్రల్లో చేగువేరా ప్రాణాలను సామ్రాజ్యవాదులు బలిగొన్నారు. చేగువేరా బలిదానం క్యూబా ప్రజల్లో అత్యంత త్యాగశీలిగా ప్రఖ్యాతిగాంచారు. క్యూబాలో సోషలిజం అభివృద్ధికి చేగువేరా ఎనలేని కృషి చేశారు. క్యూబా పరిశ్రమల శాఖా మంత్రిగా భారత్‌లో పర్యటించారు. భారతదేశం అలీన విధానం పాటించిన కాలంలో భారత్, క్యూబాలు బాగా దగ్గరయ్యాయి.
ఈ రచయిత 2017 మేడే ఉత్సవాలు సందర్భంగా సెంట్రల్ యూనియన్ ఆఫ్ క్యూబన్ వర్కర్స్ (సిటిసి) ఆహ్వానం మేరకు క్యూబా మే దినోత్సవాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రజలను కలసి సోషలిజం గురించి ఎక్కడ చర్చించినా ''మా ప్రాణాలైన వదులుకుంటాం. కానీ సోషలిజాన్ని వదలుకోం'' అనే మాటాలు స్పష్టంగా వినిపిస్తాయి. ప్రజల్లోని ఆ సోషలిస్టు చైతన్యమే నేటికి క్యూబాలో సోషలిజాన్ని కాపాడుతున్నది. అందరికీ చదువు, అందరికీ పని, అందరికీ ఇళ్ల్లూ, అందరికీ వైద్యం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులుగా అమలు జరుగుతున్నాయి. పని చేసేవారిలో అసమానతలు లేవు. డైలీ, క్యాజువల్ పద్ధతుల్లో పనులు ఉండవు. అందరూ పర్మినెంట్ ఉద్యోగులే. ప్రజలంతా ఆరోగ్యంగా వుంటారు. 12 రకాల వాక్సిన్ ప్రజలంతా వాడతారు. ప్రజలకు వైద్య సేవలందించే డాక్టర్ల నిష్పత్తి ప్రపంచంలోనే క్యూబాలో ఎక్కువ. కోవిడ్ కాలంలో క్యూబా ప్రత్యేకత ఏమిటో ప్రపంచమంతా గమనించింది. మానవత్వం అనేది కమ్యూనిస్టులకే సాధ్యమని బ్రిటిష్ షిప్‌లోని కోవిడ్ బాధితులకు క్యూబా దేశం కాపాడిన తీరు ప్రపంచాన్నే అబ్బురపరిచింది.
క్యూబా విప్లవానికి 64 సంవత్సరాలు ఘనమైన విప్లవ చరిత్ర వుంది. పక్కలో బల్లెంలాగా వున్న అమెరికా నిరంతరం క్యూబాలో సోషలిజాన్ని కూల్చాలన్న కుట్రలు నేటికీ కొనసాగుతున్నాయి. నేటికీ తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి. ప్రాణ రక్షణకు వాడే మందులుగానీ, పసిబిడ్డలకు పాలపొడి సైతం పక్క దేశాల్లో కొనుక్కోవడానికి కూడా అమెరికా అనుమతించడం లేదు. అయినా సోషలిజాన్ని కాపాడుకుంటూ, వర్గ పోరాట సిద్ధాంతాన్ని నిలబెట్టుకుంటున్న ఘన చరిత్ర క్యూబాది. దీనికి కారణం ప్రజలను నిత్యం సోషలిస్టు చైతన్యం కల్పించడంలో అత్యంత శ్రద్ధ తీసుకోవడమే. ఆనాటి అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడీ క్యూబా అధ్యక్షుడు కాస్ట్రోను ''నీవు వంద కిలోమీటర్లలోనే వున్నదని హెచ్చరించాడు. నీవు కూడా వంద కిలోమీటర్లలోనే వున్నావని'' ఫైడల్ కాస్ట్రో తిరిగి సమాధానం ఇచ్చారు. ఎన్ని కుతంత్రాలు చేసినా సోషలిజాన్ని కూల్చడం అమెరికా తరం కాలేదు. భవిష్యత్‌లో కూడా కాబోదు. మేము 2017లో క్యూబాలో పర్యటిస్తున్న సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణలు దేశమంతా ప్రజల్లో ప్రత్యేకంగా చర్చ జరుగుతున్న కాలం. ప్రభుత్వం చేపట్టే ప్రతి పని ప్రజల్లో చర్చించి, పార్టీ ద్వారా నిర్ణయాలు చేస్తుంటారు. ప్రజలు ఆ నిర్ణయాన్ని తమ సొంత నిర్ణయంగా పాటిస్తారు. వేల కిలోమీటర్ల దూరంలో వున్న ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజలను చీల్చి, సైన్యాన్ని పంపి అమెరికా కూల్చగలిగింది. రష్యా, యూరప్ దేశాల్లో కుట్రలు పన్ని సోషలిజాన్ని పడగొట్టింది. ఆనాడే ''గోర్బచెవ్'' చేపట్టిన గ్లాస్‌నాస్త్, పెరిస్ట్రోయకా విధానాలను కాస్ట్రో తప్పుపట్టారు. వర్గ సంకరవిధానాల వల్ల రష్యాలో సోషలిజం దెబ్బతింటుందని ముందుగానే ఫైడల్‌కాస్ట్రో హెచ్చరించారు. కానీ క్యూబాలో సోషలిస్టు చైతన్యం సామ్రాజ్యవాద వ్యతిరేక పునాదులపై నిర్మించబడింది. నేటికీ సోషలిస్టు చైతన్యం చెక్కు చెదరకుండా కొనసాగుతున్నది. అమెరికా పప్పులు ఎక్కడైనా ఉడికాయి కానీ, క్యూబాలో ఉడకలేదు. సోషలిజం నేటికి అజేయంగా కొనసాగుతున్నది.
క్యూబా వ్యవసాయ దేశం. చెరకు మాత్రమే పండుతుంది. ఇతర ఆదాయం ప్రధానంగా టూరిజం మాత్రమే. కోవిడ్ కాలంలో టూరిజం పూర్తిగా పడిపోయింది. రష్యాలో 1992లో సోషలిజం కూలిపోయిన తరువాత దానితో వ్యాపార సంబంధాలు తెగిపోయాయి. ఆహార కొరత ఏర్పడింది. భారతదేశం నుంచి లక్ష టన్నుల ఆహారధాన్యాలు భారత, క్యూబా సంఘీభావ కమిటీ ఆధ్వర్యాన హవానా పోర్టుకు చేరాయి. ఆ సందర్భంగా ఫైడల్ కాస్ట్రో భారత్ నుంచి లక్ష టన్నుల ధాన్యమే వచ్చినా అంతకంటే లక్షల టన్నుల ప్రజల అభిమానం అందిందని అభివర్ణించారు. భారత్-క్యూబాల మైత్రి కొనసాగాలని కోరుకుందాం.
సిహెచ్ నర్సింగరావు