Aug 13,2023 16:21

ప్రజాశక్తి - తాళ్లరేవు (కాకినాడ) : తాళ్ళరేవు పంచాయతీ గిడ్లవారిపేట ఎదురుగా ఉన్న తన పంట పొలంకు వెళ్లే ఆఆర్‌ అండ్‌ బి రహదారిని స్థానికులు ఆక్రమించారని రైతు కొల్లు రాజు ఆర్‌ అండ్‌ బి ఏ ఈ లక్ష్మీ ప్రసన్నకు విన్నవించారు. గేట్ల గిడ్లవారిపేట ఎదురుగా తనకు ఎకరం పంట పొలం ఉందని ఆర్‌ అండ్‌ బి రహదారి పక్కన ఉన్న పంట కాలువ దాటుకుని తన పంట పొలానికి రోజు వెళ్తుంటానన్నారు. అయితే ఇటీవల ఆర్‌ అండ్‌ బి రహదారి ఆర్‌ అండ్‌ బి రహదారి, పంట కాలువ గట్టు చెంతన ఆర్‌ కొందరు పశువుల పాక, గడ్డిమేట్లు వేశారని దానివల్ల తన పొలానికి వెళ్లడానికి దారి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆర్‌ అండ్‌ బి ఏ ఈ లక్ష్మీ ప్రసన్న సంఘటన స్థలానికి విచ్చేసి బాధిత రైతు కొల్లు రాజుతో మాట్లాడారు. సమస్యను ఉన్నత స్థాయి అధికారులకు నివేదించి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.