Oct 30,2023 12:06

అత్యధికులు బిజెపి అభ్యర్థులే
రాయ్ పూర్‌ : 
ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ తొలి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 223 మంది అభ్యర్థుల్లో 26 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో 16 మందిపై అత్యంత తీవ్రమైన కేసులు నడుస్తున్నాయి. మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల్లో అత్యధికంగా ఐదుగురు బిజెపికి చెందిన వారు కాగా అధికార కాంగ్రెస్‌కు చెందిన వారు ఇద్దరు, అమ్‌ఆద్మీ పార్టీకి చెందిన నలుగురు, జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జె)కి చెందిన ముగ్గురు ఉన్నారు. మొదటి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. వీటిలో ఐదు స్థానాల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది నేరచరితులు పోటీ పడుతున్నారు. బిజెపి అభ్యర్థుల్లో విజరు శర్మ (కవర్ధా స్థానం), విక్రాంత్‌ సింగ్‌ (కైరాఘర్‌), వినాయక్‌ గోయల్‌ (చిత్రకోట్‌-ఎస్టీ), అస్‌హరమ్‌ నేతమ్‌ (కన్‌కర్‌-ఎస్టీ), సోయమ్‌ ముక్కా (సుక్మాా-ఎస్టీ) తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లలో తెలియజేశారు. తొలి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 46 మంది కోటీశ్వరులు. వీరిలో కాంగ్రెస్‌కు చెందిన వారు 14 మంది ఉండగా బిజెపి, ఆప్‌ పార్టీలకు చెందిన వారు ముగ్గురు చొప్పున ఉన్నారు.