హైదరాబాద్: తెలంగాణలోని సంప్రదాయ విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీయూహెచ్‌లోని పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ పీజీ ప్రవేశ పరీక్ష -2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, ఓయూ వీసీ డి.రవీందర్ విడుదల చేశారు.ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంతో పాటు జేఎన్‌టీయూ -హైదరాబాద్‌లో పీజీ, ఇంటిగ్రేటెడ్, పీజీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సీపీగెట్ - 2023 పరీక్షలు జూన్ 30 నుంచి జులై 10 వరరకు సీబీటీ ద్వారా నిర్వహించగా.. 60,443మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.