Aug 06,2023 16:37
  • న్యాయవాదులకు ఐలు నాయకులు పిలుపు

ప్రజాశక్తి కాకినాడ : ఆగస్టు 12 ,13 తేదీల్లో గుంటూరులో జరగనున్న ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ యూనియన్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ మెడపాటి ధర్మారెడ్డి, గుదిమెళ్ళ భాస్కరాచార్యులు న్యాయవాదులకు పిలుపునిచ్చారు. సందర్భంగా ఆదివారం వారు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న దాడులు నేపథ్యంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో న్యాయ వాదుల రక్షణకు బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఐలు రాష్ట్ర మహాసభల సందర్భంగా న్యాయవాదుల రక్షణకు నమూనా చట్టాన్ని ఐలు రుపొందిస్తుందన్నారు. ఐలు రాష్ట్ర మహాసభలు గత కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్‌ కర్తవ్యాలను రూపొందించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

నూతన కమిటీ ఎన్నిక

నూతన ఐలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డా.మేడపాటి ధర్మారెడ్డి,జి.ఎస్‌ .భాస్కరాచార్యులు, ఉపాధ్యక్షులుగా ఆర్‌. వి. రమణారావు, ఇక్బాల్‌, కార్యదర్శులుగా ఎ.కె.ఎన్‌ మల్లేశ్వరరావు, కె.ఆర్‌. కె .రాజు, రమణమూర్తి ఎస్‌. శ్రీనివాస్‌, ట్రెజరర్గా వెంకటరెడ్డి బహుదూర్‌ షా మరో 26 మంది సభ్యులతో నూతన జిల్లా కమిటీ ఎన్నికయ్యారనీ తెలిపారు.

కాకినాడ నగర కమిటీ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులుగా పి రామచంద్రరాజు, కె నాగజ్యోతి

కాకినాడ నగర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పి రామచంద్రరాజు, కె నాగజ్యోతి, వైస్‌ ప్రెసిడెండ్‌ గా ఉమామహేశ్వరావు, ట్రెజరర్‌ రాధాకష్ణ, దేశీ 12 మందితో నగర కమిటీ ఎన్నికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని బార్‌ అసోసియేషన్‌ల నుండి న్యాయవాదులు హాజరైనట్లు తెలిపారు. జిల్లా మహాసభలు విజయవంతానికి కృషి చేసిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.