Aug 08,2023 16:28
  • గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం పిలుపు

ప్రజాశక్తి కాకినాడ : ప్రతిపక్ష హౌదాలో జగన్‌ విఆర్‌ఏలను పర్మినెంట్‌ చేస్తానన్న హామీని అమలు చేయాలని కోరుతూ వీఆర్‌ఏల తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుశిబిరాన్ని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 25 వేల మంది వీఆర్‌ఏలను పర్మినెంట్‌ చేస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఎందుకు చేయదని ప్రశ్నించారు. ప్రతిపక్ష హౌదాలో ఇచ్చిన హామీలను జగన్‌ నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. ఆగస్టు 25వ తారీఖున ఛలో విజయవాడకు జిల్లా నుంచి వీఆర్‌ఏలందరూ పెద్ద సంఖ్యలో హాజరై డిమాండ్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. పెంక్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డి అర్‌ ఓ కి అందించారు. రెండవ రోజు శిబిరంలో విఆర్‌ఏ సంఘం జిలా అధ్యక్షులు నిడమర్ధి సురేష్‌ ఇజ్రాయెల్‌, తొండంగి రాజు, కోటనందురు తాతారావు, తుని నాగేశ్వరరావు, తొండంగి సత్యన్నారాయణ పాల్గొన్నారు. ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ శిబిరానికి విచ్చేసి మద్దతుతెలిపారు.