Aug 23,2023 15:10

ప్రజాశక్తి - సామర్లకోటరూరల్‌ (కాకినాడ) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1లో సామర్లకోటకు చెందిన తర్లంపూడి చైతన్య మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాడు. ఈసందర్భంగా చైతన్యను రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ.. తర్లంపూడి కమల్‌ రాజ్‌ కుటుంబం తమకు ఎంతో ఆప్తులని, అటు వంటి సామాన్య కుటుంబంలో పుట్టి గ్రూప్‌-1లో విజయం సాధించడం గర్వకారణమని, ట్రైనింగ్‌ అనంతరం సామర్లకోటకు చెందిన వ్యక్తి ఐఏఎస్‌ వంటి పోస్టును చేపట్టాలని, మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. మరో ముఖ్య అథితి రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు దవులూరి సుబ్బారావు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పెంపకం బట్టే పిల్లల ఎదుగుదల ఉంటుందని ఒక మంచి ఎప్పుడు మంచి ఫలాలను అందిస్తుంది అనడానికి చైతన్య ఒక నిదర్శనమన్నారు. విద్యతో సంపదను సంపాదించవచ్చు కానీ సంపాదనతో విద్యను సంపాదించలేమని, గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారని, జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు ద్వారా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని సుబ్బారావు పేర్కొన్నారు.అనంతరం గ్రూప్‌ వన్‌ విజేత చైతన్య మీడియా తో మాట్లాడుతూ తన కన్న తల్లిదండ్రుల ఆశీస్సుల తో గ్రూప్‌ వన్‌ లో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా తను మెయిన్స్‌ ని రాయడం జరిగుందన్నారు. భవిష్యత్‌ లో సమాజానికి 24 గంటలు ప్రజలకు సేవలు అందించే పోస్ట్‌ లో తాను ఉండాలని కోరుకుంటున్నట్లు చైతన్య పేర్కొన్నారు.అంతకుముందు ముఖ్య అతిథులు తండ్రి తనయులు సుబ్బారావు, దొరబాబు చేతులు మీదుగా కేక్‌ కటింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఊబా జాన్‌ మోజెస్‌,ఎం.పిపి బొబ్బరాడ సత్తిబాబు,కమీషనర్‌ జె.రామరావు,సీనియర్‌ కౌన్సిలర్‌ ఆవాల లక్ష్మీనారాయణ,నేతల హరిబాబు, వారా పాప, చైతన్య తల్లితండ్రులు కమల్‌ రాజ్‌, వైసీపీ నాయకుడు గంగిరెడ్డి కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు సుంకవిల్లి బాపిరాజు, యార్లగడ్డ అక్కరాజు, తదితరులు పాల్గొన్నారు.