ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా నూతన జిల్లా వైద్యరోగ్యాధికారి డా.జె.నరసింహ నాయక్‌ని మర్యాద పూర్వకముగా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నాయకులు కలసి శుభాకాంక్షలు తెలియాజేశారు. ఈ సందర్బంగా డిఎం అండ్ హెచ్‌ఒ నాయక్ గ్రామ, వార్డు సచివాలయం ఉద్యగుల కొన్ని అపరిష్కృత సమస్యలను వారి దృష్టికి తీసుకొని వెళ్లగా వారు సానుకూలంగా స్పందించి సాధ్యమైంత త్వరిత్తగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డి.ఎ.రతన్ రాజ్, ప్రధాన కార్యదర్శి చీకట్ల శ్రీనివాస్, వైస్.ప్రసిడెంట్ రాధకృష్ణ, ఇబ్రహీం, గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి ప్రభారాణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నీరజ, నాగ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










