Sep 13,2023 16:31

ప్రజాశక్తి-నార్పల(అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ చూపిన క్రీడాకారులు నియోజకవర్గస్థాయి పోటీలలో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయుడు రవికుమార్‌ తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు 9 క్రీడాంశాలకు సంబంధించి నాలుగు విభాగాలుగా అండర్‌ 14 బాల, బాలికలు అండర్‌ 17 బాల,బాలికలు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి కృష్ణయ్య, ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్‌ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నార్పల మండలం నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదిగారని అదే స్ఫూర్తితో మీరు కూడా అంత ఉన్నతి సాధించాలని ఎంఈఓ కృష్ణయ్య తెలిపారు. హెచ్‌ఎం రవికుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఆటలు రెండు కళ్ళు లాంటివని అని చదువు జ్ఞనాన్ని పెంచితే ఆటలు ఆరోగ్యాన్ని పెంచుతాయని అన్నారు.. ఈ కార్యక్రమంలో మండల సమన్వయకర్త ఆంజనేయులు వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్‌, శ్రీనివాసులు, శ్రీదేవి, నసీమా, సుజాత, కాటమయ్య, మల్లికార్జున, సురేఖ తదితరులు పాల్గొన్నారు.