
'మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయి.. అలాగే కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి' అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై కుమార స్వామి (అక్షర) దర్శకత్వంలో తెరకెక్కిన 'షరతులు వర్తిస్తాయి' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ని తాజాగా ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున్ సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాణంలో చైతన్యరావు, భూమి శెట్టి జంటగా నటించారు.