ఉంగుటూరు, ప్రజాశక్తి (ఏలూరు జిల్లా) : రైతు సహకార సంఘాల్లో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వెంటనే వాటికి సవరణ చేపట్టాలని సొసైటీ ఉద్యోగులు, సిబ్బంది సోమవారం ఆందోళన చేపట్టారు. ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగ ఐక్యవేదిక పిలుపు మేరకు నారాయణపురం సొసైటీ సిబ్బంది చలో విజయవాడ కార్యక్రమానికి ఈరోజు బయలుదేరారు. సొసైటీలో రైతులు కానివారికి కూడా వాటా ఇచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.










