Jun 04,2023 09:14

ఎక్కువ సమయం కంప్యూటర్‌ స్క్రీన్‌ చూస్తుండటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రతి ఒక్కరం రోజూ ఏదోక డిజిటల్‌ స్క్రీన్‌ చూస్తూనే వుంటున్నాం. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ఫోన్‌, టీవి స్క్రీన్‌లను మనకు తెలీయకుండానే ఒకటి తర్వాత మరొకటి వాడేస్తుంటాం. వీటితో గడిపే సమయం కంటే... కళ్లు చాలా విలువైనవి. కొన్ని స్క్రీన్స్‌ వాడటం తప్పనిసరి అయినప్పుడు కనీస జాగ్రత్తలైనా పాటించాలి. లేదంటే కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ బారిన పడతాం. కళ్లలో అసౌకర్యం, మంట, కళ్లు పొడిబారటం, దృష్టిలో స్పష్టత లేకపోవడం, తలనొప్పి లక్షణాలన్నీ ఈ సిండ్రోమ్‌ లక్షణాల్లో ముఖ్యమైనవి. ఈ లక్షణాల నుంచి బయట పడటానికి 20-20-20 ఫార్ములాను చాలాసార్లు చదివే వుంటాం. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో 20 సెకన్లపాటు చూడాలి. అలా చూస్తూ.. కంటి రెప్పలను మూస్తూ తెరుస్తూ వుండాలి. ఇలా చెయ్యడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది.